తెలంగాణ ఇచ్చినా.. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలేదు: ప్రధాని నరేంద్రమోదీ

-

రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధురి అడ్డుతగిలారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటుందని.. అక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఏ రాష్ట్రం కూడా స్వీకరించడం లేదని అన్నారు. ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీకి అహంకారం తగ్గడం లేదని విమర్శించారు.

నాగాలాండ్ లో 24 ఏళ్ల క్రితం, ఓడిశాలో 27 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కు ఓటేశారని ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ విజయం సాధించలేదని ఆయన అన్నారు. 28 ఏళ్ల క్రితం గోవాలో పూర్తి మెజారిటీతో గెలిచారని.. 1988 త్రిపురలో, 1972లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ కు గుర్తు చేశారు.

కరోనా సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరిగా లేదనిి ఆయన విమర్శించారు. ముంబైలో ప్రజలు గుమిగూడేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజల్ని ఊళ్లు వెళ్లేలా ప్రోత్సహించారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version