ఇది పీకే అసలు స్వరూపం…పీకే ఓ పొలిటికల్ బిజినెస్ మ్యాన్ అంటూ కామెంట్స్

-

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది.తాజాగా ఓ టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ ఎంత అంచనాలు ఎలా ఉంటాయో తేలిపోయింది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కు ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కరణ్ థాపర్…ప్రశాంత్ కిషోర్ తో మీ అంచనాలు గతంలో విఫలమయ్యాయని చెబుతూ హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని తెలంగాణలో బీ.ఆర్.ఎస్ అధికారంలోకి వస్తుందని గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలను కరణ్ థాపర్ గుర్తు చేయగా….తాను అలా అనలేదే అని బుకాయించే ప్రయత్నం చేశారు.అలా ఎక్కడ ఉందో చూపండి అని నిలదీసాడు.

ఆ షోలో అంటే లైవ్ లో ప్రశాంత్ కిషోర్ ట్వీట్ ను కరణ్ థాపర్ చూపించారు.దీంతో పీకే షాక్ కి గురయ్యారు.తాను చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలిసిపోవడంతో ఏం చేయాలో పాలుపోని ప్రశాంత్ కిషోర్ ఆవేశంతో ఊగిపోతూ అసలు మీరు జర్నలిస్టనా అంటూ కరణ్ థాపర్ పై ఆగ్రహం చెందారు.ఈ షో చూసిన ఏపీ ప్రజలు తాజా ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పుతాయని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కామెంట్లు పెట్టేస్తున్నారు.అంతేకాదు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న వీడియోలు ఇటీవల చూస్తున్నాం. అంటే ఇక్కడ కూటమి గెలుస్తుంది అనడాన్ని ఎవ్వరు స్వాగతించట్లేదు.పైగా రోజు రోజుకీ వైసీపీ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడం అసాధ్యమని కూటమికి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ వేర్వేరు సందర్భాల్లో కామెంట్లు చేశారు.ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ప్రశాంత్ కిషోర్ పరువు పోవడం ఖాయమని చాలామంది అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తూ విశ్వసనీయతను కోల్పోతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. మళ్లీ తామే గెలుస్తామని వైసీపీ ధీమాతో ఉండగా పీకే చెప్పిన మాటలు నమ్మి కూటమి నేతలు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. జూన్ 4న ఫలితాలు వచ్చాక పీకే పట్ల, కూటమి ఓవర్ కాన్ఫిడెన్స్ పట్ల ప్రజలు నవ్వుకోవడం గ్యారంటీ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version