హైదరాబాద్ ను యూటీ గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ సిటీగా లేదా యూటీ గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2తో ముగుస్తోందని తెలిపారు.

ఈ క్రమంలో కొందరు హైదరాబాద్ ను  మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సంక్లిష్ట సమమంలో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని హరీశ్ రావు కోరారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేసేందుకు లోక్ సభలో  బీజేపీ బిల్లు పెడితే.. ఆ బిల్లుకు మద్దతు తెలిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ వశం అయితే.. కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version