కాంగ్రెస్ నేతలంతా కోరుకుంటే తాను పార్టీ కోసం పని చేస్తాం అంటూ రాహుల్ ప్రకటనతో పార్టీలో జోష్ నిండింది. పార్టీలో మార్పులు కోరిన అసమ్మతి నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా భేటీ అయ్యారు. కొత్త ఏడాదిలోగా పార్టీకి నూతన అధ్యక్షుడు ఎన్నుకుంటారని ఊహాగానాల మధ్య ఈ సమావేశం జరగ్గా… రాహుల్ తాజా వ్యాఖ్యలు ప్రధానంగా మారాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు.