మూడు రాష్ట్రాల సంగమం గుడలూరు.. జోడో యాత్రలో రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర 21వ రోజుకు చేరుకుంది.  ఈ యాత్ర కేరళ నుంచి తమిళనాడు చేరుకుంది. కేరళలో జోడో యాత్ర ముగించుకున్న రాహుల్.. తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరులో అడుగుపెట్టారు. ఇవాళ ఈ యాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ యాత్రకోసం తమిళనాడు పీసీసీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దారిపొడవునా పోలీసులు భద్రత కల్పించారు.

‘మా సోదరి సిమ్లాలో ఇల్లు కట్టుకుంది. అది చాలా అందంగా ఉంది. కానీ ఆమె ఇప్పుడు గుడలూరులో ఉండుంటే బాగుండు. దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతం ఇదని ఆమె తెలుసుకుని ఉండాల్సింది. ఇక్కడి కొండలు, సహజ ప్రకృతి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి’ అని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు.

గుడలూరుకు ఓ ప్రత్యేకత ఉందని రాహుల్ గాంధీ అన్నారు. తమిళం, కన్నడ, మలయాళం భాషలకు నిలయంగా, 3 రాష్ట్రాల సంగమంగా ఉంటుందని చెప్పారు. భాషలు, సంస్కృతులపై తమకెంతో గౌరవం ఉందని తెలిపారు. వాటిపై మమకారం ఉందని చెప్పారు. ఇక్కడ నడక సాగించడం ఆనందం, సంతృప్తిని ఇస్తోందన్నారు. దేశం ఐక్యంగా ఉండేందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకే యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో అన్ని భాషలు, సంస్కృతులతో పాటు పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఉన్నారని వివరించారు.

సభలో రాహుల్‌ ప్రసంగిస్తుండగా మధ్యలో ఓ మసీదు నుంచి అజాన్‌ వినిపించడంతో ప్రసంగానికి విరామం ఇచ్చారు. రాత్రికి గుడలూరులోనే బసచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version