వాళ్లను విచారించగా.. జయభేరి అనే కంపెనీకి చెందిన ఉద్యోగులు ఈ డబ్బులు ఇచ్చారని.. వాటిని రాజమండ్రిలో యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌కు అందించాలని చెప్పినట్లు చెప్పారు.
రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు రాష్ట్రమంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఆయనకు సంబంధించిన రెండు కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకొని వాళ్ల బ్యాగ్ చెక్ చేయగా.. అందులో రెండు కోట్ల రూపాయలు దొరికాయి.
వాళ్లను విచారించగా.. జయభేరి అనే కంపెనీకి చెందిన ఉద్యోగులు ఈ డబ్బులు ఇచ్చారని.. వాటిని రాజమండ్రిలో యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌కు అందించాలని చెప్పినట్లు చెప్పారు. ఆ డబ్బులను రాజమండ్రికి రైళ్లలో తరలించేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించినట్టు తెలిపారు. దీతో టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మురళీ మోహన్‌తో మాట్లాడేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని తెలిసింది.