ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే నెల కాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు స్థానాలను వైసీపీనే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనితో నలుగురు ఎవరు అవుతారు అనేది అందరికి ఆసక్తికరంగా మారింది. జగన్ ఎవరిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది అనే దాని మీద కొన్ని చోట్ల బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. అటు ఎన్డియే కి రెండు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియకపోయినా ఇప్పుడు కొన్ని పేర్లు వినపడుతున్నాయి.
మంత్రి మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆయన జగన్ తోనే నడిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా సరే జగన్ ఆయన మీదున్న నమ్మకం అభిమానం తో ఎమ్మేల్సీని చేసి మంత్రిని చేసారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య మండలి రద్దు అయింది. దీనితో జగన్ ఆయనకు మరో విధంగా న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. రాజ్యసభకు పంపించాలి అని భావిస్తున్నారు.
దీనికి పార్టీ నేతలు కూడా అంగీకారం తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు కి పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన కూడా జగన్ కోసం మంత్రి పదవి వదులుకున్న వారిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఆయనను ఎమ్మెల్సీ ని చేసి జగన్ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.