చేవెళ్లలో హీటెక్కిన రాజకీయం.. రంజిత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో ఉన్నారా..??

-

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు గరం గరంగా మారాయి… ఇతర పార్టీలో ఉండే ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. తమ ఆధిపత్యానికి గండిపడుతుందని మరికొందరు భయపడుతున్నారు.. దీంతో చేవెళ్లలో రాజకీయం హీటెక్కింది..

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రాజకీయాలలో ఇలాంటి భాష వాడటం తానెప్పుడు వినలేదని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఆయన మీడియాకు వెల్లడించారు.. అసలు ఎంపీ రంజిత్ రెడ్డికి కోపం ఎందుకు వచ్చిందా అనే చర్చ బిఆర్ఎస్ లో జరుగుతుంది..

రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో BRS తరపున చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు.. ఈ క్రమంలో మరోసారి అయిన బరిలో ఉండబోతున్నారు.. అయితే బిజెపి నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బరిలో ఉండడంతో వారిద్దరి మధ్య పోటాపోటీగా రాజకీయాలు నడుస్తున్నాయి.. ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులకు ఫోన్ చేసి తనకు మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థించారట.. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారని పార్టీలో చర్చ నడుస్తుంది.. తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారంటూ ఆయన మండిపడుతున్నారట.. ఈ క్రమంలోనే రంజిత్ రెడ్డికి ఫోన్ చేసి తిట్టారని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు.. రంజిత్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని అందుకే తమ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి ఫోన్ చేసి తిట్టారంటూ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

చేవెళ్లలో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు అసాధ్యమని.. కచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. రంజిత్ రెడ్డి ఓటమి భయంతో ప్రస్టేషన్ లో ఉన్నారని బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news