విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకోవడానికి కారణం అదేనంట..

-

సార్వత్రిక ఎన్నికల ఓటమి బాధలో ఉన్న వైసీపీకి.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం బూస్టప్ ను ఇచ్చింది.. ఈ ఎన్నికలో బొత్సను అభ్యర్దిగా ప్రకటించిన వైసీపీ అదినేత జగన్.. దూకుడుగా వ్యవహరించారు.. ప్రజాప్రతినిధులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. గెలుపు ప్రాధాన్యతను వివరించారు.. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు.. ఆయన దూకుడు.. స్టాటజీనే వైసీపీకి విజయానందించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

ఏ ఉప ఎన్నిక వచ్చినా.. అధికారంలో ఉన్న పార్టీనే విజయం సాధిస్తూ ఉండటం మనం చూశాం.. కానీ విశాఖ ఉప ఎన్నిక మాత్రం అలా జరగలేదు.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వైసీపీ అభ్యర్ది బొత్స సత్యనారాయణ గెలిచారు.. ఇందులో వైసీపీ స్టాటజీ ఉందని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుని ఉంటే.. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను తమ వైపుకు తిప్పుకునేవారు.. కానీ వారు అలా చెయ్యలేదు.. ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిస్తే.. పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశముందని సీఎం చంద్రబాబునాయుడు భావించారట.. గెలిచేందుకు చంద్రబాబునాయుడు ఏదోరకంగా ప్రలోభావాలకు గురిచేస్తారని.. వైసీపీ అధినేత జగన్ కూడా పదేపదే వ్యాఖ్యలు చెయ్యడం కూడా టీడీపీ వెనక్కి తగ్గడానికి కారణని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు..

ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఐక్యంగా ఉండటం వల్లే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకున్నారని.. లేదంటే అభ్యర్దిని బరిలోకి దించేవారని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై స్వంత పార్టీలోనే అసంతృప్తి కనిపిస్తుంది .బరిలోకి దిగుంటే ఖచ్చితంగా గెలిచేవారమని టీడీపీలో ఓ వర్గం అంటుంది. జగన్ స్టాటజీ ముందు చంద్రబాబు తలవంచక తప్పలేదనే గుసగుసలు టీడీపీలో వినిపిస్తున్నాయి.. టీడీపీ నిర్ణయం ఎలా ఉన్నా .. బొత్స గెలుపు మాత్రం వైసీపీ లో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version