తెలంగాణలో రేవంత్ రెడ్డిని వాడుకొనే విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలావరకు తప్పు చేసింది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. రాజకీయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉన్నా సరే ఆయన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా దృష్టి సారించలేదు. చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే రేవంత్ రెడ్డి జానా రెడ్డి తో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. జానారెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ అంగీకరిస్తున్నారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు వారి బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన అప్పగించక పోయినసరే ఆయనకు కచ్చితంగా ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది.
కాబట్టి రేవంత్ రెడ్డి ఎలా ముందడుగు వేస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే రేవంత్ రెడ్డికి సహకరించే నేతల విషయంలో కాంగ్రెస్ లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు సహకరించకపోతే ఆయన పార్టీ మారడానికి కూడా సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది.