తెలంగాణలో ఇప్పుడల్లా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లేవ్.. వచ్చే అవకాశమూ లేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలమూడ్ ను తెలుసుకునేందుకు ఓ అడుగు ముందుకేసింది.. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..? హైడ్రాతో పాటు, మూసీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంది.. అందులో భాగంగా సర్వేలు చేయిస్తోంది.. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సర్వేలు చేయించి.. ప్రజల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది.
ఎన్నికల సమయంలో సర్వేలు చెయ్యడం సర్వసాధారణం.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుస్తారు.. ప్రజల మద్దతు ఎవరికి ఉంది అనే కోణంలో సర్వేలు జరుగుతూ ఉంటాయి.. కానీ తెలంగాణలో ప్రభుత్వ పనితీరుపై సర్వే జరుగుతోందట.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారు..? పథకాల లక్ష్యాలు ఎలా ఉన్నాయి..? పథకాలపై వారి ఫీడ్ బ్యాక్ ఏంటి..? లోకల్ ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది..? మంత్రులు ఎలా స్పందిస్తున్నారు..? వంటి ప్రశ్నలతో సర్వేలు జరుగుతున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది.. ఈ క్రమంలో ఉచిత బస్సు హామీతో పాటు.. రైతుల రుణమాఫి వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది.. దాంతో పాటు అక్రమ కట్టడాల పనిపడుతోంది.. మరోవైపు మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది.. వీటిపై కొన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవ్వగా..మరికొందరు స్వాగతిస్తున్నారు.. అయితే సర్వేలు చేసి ప్రజల పీడ్ బ్యాక్ తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట..అందుకే సర్వే జరుగుతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు..
ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన అనంతరం వారు కొరుకుంటున్న పథకాలను అమలు చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.. ప్రభుత్వం నుంచి వారేం కొరుకుంటున్నారు..? మంత్రుల పనితీరు ఎలా ఉంది..? క్యాడర్ హ్యపీగా ఉందా అనే కోణంలో కూడా సర్వేలు జరిపి.. ఆ నివేదికను తనకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారట.. దీంతో రంగంలోకి దిగిన ఓ ప్రయివేట్ ఏజన్సీ ప్రజల మూడ్ ను తెలుసుకుంటోంది.. త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సర్వే చెయ్యడం మంచిదేనని భావనలో నేతల్లో వ్యక్తమవుతోంది..