రాజ‌కీయాల్లోకి రాబ‌ర్ట్ వాద్రా.. ఎంపీగా పోటీకి సై!

-

కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భ‌ర్త‌.. రాబర్ట్ వాద్రా ప్ర‌త్యేక్ష రాజ‌కీయాల్లోకి దిగ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాపార వేత్త‌గా ఉన్న రాబ‌ర్ట్ వాద్రా క్రీయాశీల‌క రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్టు తెలుస్తుంది. కాగ త‌న‌ను ఎంపీగా పోటీ చేయాల‌ని ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయా పార్టీలు త‌న‌తో చ‌ర్చించాయ‌ని కూడా రాబ‌ర్ట్ వాద్రా తెలిపారు. ఆయన స్వ‌స్థ‌లం అయిన ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నుంచి ఎంపీ సీటు ఇవ్వ‌డానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇత‌ర పార్టీలు కూడా ముందుకు వ‌చ్చాయ‌ని ఆయ‌న తెలిపారు.

కాగ త‌న‌పై బీజేపీ తో పాటు ఇత‌ర పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లును రాజ‌కీయంగా తిప్పి కోట్టాల‌ని ఆయ‌న అన్నారు. అందుకు రాజ‌కీయాల్లోకి రావ‌డం అవ‌స‌రం అని అన్నారు. కాగ తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం అనేది మాత్రం.. త‌న కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించిన అనంత‌ర‌మే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. అయితే.. రాబ‌ర్ట్ వాద్రా మొరాదాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గం నుంచి వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ రాబ‌ర్ట్ వాద్రాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వ‌డానికి కూడా సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version