kcr press meet : మ‌ర‌ణించిన రైత‌ల‌కు రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలి

-

కేంద్రం తీసుకువ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఏడాది పాటు గా చాలా మంది రైతులు ఉద్యమం చేశార‌ని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ఉద్య‌మంలో చాలా మంది రైతుల చ‌నిపోయార‌ని అన్నారు. వారంద‌రికీ కూడా రూ. 25 ల‌క్ష‌ల చొప్పున పరిహారం ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశాడు. అలాగే ఈ ఉద్యమం లో చాలా మంది రైతుల పై అక్ర‌మ కేసుల‌ను పెట్టార‌ని అన్నారు. ఆ కేసుల‌న్నీటి ని కూడా వెంట‌నే ఎత్తి వేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశాడు.

సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డ‌మే కాదు మ‌ర‌ణించిన రైత‌లను కూడా ఆదు కోవాల‌ని డిమాండ్ చేశాడు. కాగ చ‌నిపోయిన రైతుల‌కు ప్ర‌తి ఒక్కరికి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి రూ. 3 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ పరిహారాన్ని అందిచ‌డానికి స్వ‌యం గా సీఎం కేసీఆర్ రే వెళ్త‌న‌ని తెలిపాడు. కాగ మూడు సాగు చ‌ట్టాల‌ను ఇటీవ‌ల భార‌త ప్ర‌ధాని మోడీ రద్దు చేసిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version