ట్రావెల్: ఒంటరిగా పర్యటించాలని అనుకుంటున్నారా? ఈ ప్రాంతాలు మిస్ అవకండి.

-

పర్యాటకం మనసుకు, శరీరానికి మంచి ప్రశాంతత ఇస్తుంది. మీకు కావాల్సిన వాళ్ళతో మీకు నచ్చే ప్రాంతాల్లో పర్యటిస్తే వచ్చే శక్తి అంతా ఇంతా కాదు. ఐతే కొన్ని సార్లు ఒంటరిగా ప్రయాణించాలన్న కోరిక కలుగుతుంది. ఎవ్వరూ లేకుండా కేవలం మీరొక్కరే పర్యటనకు వెళ్ళాలని మీరు అనుకుంటే ప్రపంచంలోని ఈ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోండి.

థాయ్ లాండ్

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇబ్బంది లేకుండా హాయిగా తిరిగే ప్రాంతం థాయ్ లాండ్. బీచులు, దీవులు మీకు చాలా ప్రశాంతత ఇస్తాయి. అదీగాక ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది.

ఇటలీ

అందమైన నగరాలతో అత్యద్భుతంగా ఉండే ఇటలీని, మీ పర్యాటక లిస్టులో చేర్చుకోండి. ఇటలీ వీధుల్లో ఒంటరిగా తిరుగుతూ ప్రపంచాన్ని అన్వేషిస్తే వచ్చే మజా చాలా బాగుంటుంది. ఇటాలియన్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్పెయిన్

ఆర్కిటెక్చర్ నుండి ఆర్ట్ మ్యూజియంల వరకు, స్పెయిన్ లో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నప్పటికీ మీ మనసు గదిలో ఎన్నో జ్ఞాపకాలను నింపుకోవచ్చు.

జపాన్

ఇక్కడ ఉండే ఎనర్జీ మీ నరాల్లోకి నింపుకున్నారంటే సరికొత్త వేగంతో పనిచేయడం మొదలెడతారు. జపాన్ వాసుల తెలివి, పనిచేసే తత్వం, అన్నీ కలిసి మిమ్మల్ని మీరు శోధించుకునేలా చేస్తాయి.

ఫ్రాన్స్

ఫ్యాషన్ మీద ఆసక్తి ఉండి ఒంటరిగా పర్యటిద్దాం అనుకుంటే ఫ్రాన్స్ ని మించినది మరోటి లేదనే చెప్పాలి. ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా గల ఈ దేశంలో అద్భుత ప్రాంతాలను సందర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version