ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా అబ‌ద్దాల కంపెనీనా..? : కేంద్రంపై హ‌రీష్ రావు ఫైర్

-

ప్ర‌భుత్వాన్ని నడుపుతున్నారా.. అబ‌ద్దాల కంపెనీని నడుపుతున్నారా అంటూ కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి గిరిజన రిజ‌ర్వేషన్ల పెంపు ప్ర‌తిపాద‌న రాలేద‌ని కేంద్రం ప‌చ్చి అబద్ధాలు ఆడుతుంద‌ని మండి ప‌డ్డారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన బిల్లును తొక్కి పెట్టింది కేంద్ర సర్కార్ డ్రామా ఆడుతుందని విమ‌ర్శించారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదని చెప్పిన కేంద్ర మంత్రిని వెంట‌నే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

harishrao

అలాగే తెలంగాణ గిరిజనులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సమాధానం పై రేపు టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తార‌ని తెలిపారు. దీంతో పాటుగిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు టిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేప‌డుతుంద‌ని ప్ర‌క‌టించారు. గిరిజ‌న రిజ‌ర్వేషన్ల బిల్లు ఆమోదం పొందే వ‌ర‌కు బీజేపీని విడిచిపెట్టేది లేదని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news