ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు దూకుడుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయంతో పాటుగా పరిపాలన కూడా సాగిస్తున్నారు ఆయన. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారో అదే స్థాయిలో దూకుడు రాజకీయ నిర్ణయాల్లో కూడా ఉంటుంది. విశాఖకు పరిపాలనా రాజధాని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు జగన్.
అంత వరకు బాగానే ఉంది గాని కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. కీలక శాఖల్లో ఉద్యోగులు ఇప్పుడు తాము విశాఖకు వెళ్ళలేమని చెప్తున్నారు. దీనికి తోడు ఆ విషయాలను బయటపెడుతూ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆర్ధిక, రెవెన్యు, జలవనరులు లాంటి కీలక శాఖల్లో ఉన్న అధికారులు ఇప్పుడు మేము విశాఖ వెళ్ళేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వాటిని మీడియా ముందు కూడా చెప్పేందుకు చూస్తున్నారు.
దీనితో జగన్ వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి గాని ఇలా రచ్చకు ఎక్కితే మాత్రం ఇబ్బంది పడతారని, సమస్యలు ఎం ఉన్నా సరే నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం చూపిస్తాం గాని ఈ విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం తాను చేసేది తాను చేస్తానని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మాత్ర౦ ఇబ్బందులు పడతారని హెచ్చరించారట. విశాఖ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వెళ్లాలని చెప్పారట