ఎన్నో అంచనాల మధ్య తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ పెట్టిన ఆమె ఏ మాత్రం హడావిడి చేయకుండా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెట్టిన మొదట్లో షర్మిల కాస్త తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేశారు. కానీ తర్వాత నుంచి ఆమె సైలెంట్‌గా పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అటు షర్మిల పార్టీని అధికార టీఆర్ఎస్ గానీ, బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
కానీ అవేమీ షర్మిల పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కేవలం నిరుద్యోగ సమస్యపై పోరాటం చేసుకుంటూ వెళుతున్నారు. జిల్లాల వారీగా దీక్షలు చేస్తూ, తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల డిమాండ్‌తో ప్రతి మంగళవారం దీక్షకు దిగుతున్నారు.
అలాగే ఈ అంశంపైనే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిల కేవలం నిరుద్యోగ సమస్యలపై పోరాడటంపై ఏమైనా వ్యూహం ఉందా అనేది అర్ధం కావడం లేదు. అంటే మొదట యువతని ఆకట్టుకుంటే తనకు ప్లస్ అవుతుందని షర్మిల అనుకుంటున్నారో లేక దీని ద్వారా వేరే ప్లాన్ చేస్తున్నారనేది భవిష్యత్‌లో డిసైడ్ కానుంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.