బ్రేకింగ్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు…

-

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంట్రన్స్ కు 90 శాతం హాజరు కాగా… ఎంసెట్ అగ్రికల్చర్ మరియు మెడికల్ స్ట్రీమ్ కు 91.19 శాతం హాజరు అయ్యారని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ ఎంసెట్ పరీక్షల ఫలితాలను eamcet.tsche.ac.in అధికారిక వెబ్ సైటు ద్వారా చూసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇక ఈ నెల 4, 5, 6, 9, 10 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలను నిర్వహించింది ప్రభుత్వం. ఇవాళ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల కాగా… మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 30 న ప్రారంభం కానుంది. ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనుంది తెలంగాణ ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version