పదునెక్కిన వ్యూహాలు ఏ పార్టీని అయినా అధికారంలోకి తీసుకురాగలవు. ఇప్పటికే ఎన్నో పార్టీల విషయంలో ఇది నిరూపితమయింది. కాకపోతే దానికి కష్టపడాల్సి ఉంటుంది. కానీ సెంటిమెంట్లతో ఏ పార్టీ కూడా అంత ఈజీగా అధికారంలోకి రాలేదు. ఈ విషయం జగన్‌ను చూస్తేనే అర్థమవుతుంది. ఆయన తన తండ్రి సెంటిమెంట్‌ను ఎంత ఉపయోగించినా చివరకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే తనను అధికారంలోకి తెచ్చాయి.ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా వ్యూహాల మీదనే నడుస్తున్నాయి. ప్రత్యర్థి వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే గెలుపు సాధ్యం. కానీ తెలంగాణ రాజకీయాల్లో స్థిరపడాలని చూస్తున్న షర్మిల sharmila మాత్రం ఈ విషయాన్ని ఇంకా అమలు చేయట్లేదు. అయితే ఆమె రీసెంట్‌గా ఓ వ్యూహకర్తను నియమించుకున్నారు.
ఆమెనే తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె అయిన ప్రియను నియమించుకున్నారు. ఈమెకు ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఆ అనుభవం కొత్తగా పెడుతున్న పార్టీని అధికారంలోకి తెచ్చేంత లేకపోవచ్చనే చెప్పాలి. రాజకీయాల్లో ఆరితేరిన దిట్టనలు నమ్ముకుంటనే తెలంగాణలో షర్మిల పార్టీకి మనుగడ ఉంటుంది. లేదంటే మూన్నాళ్ల ముచ్చటే అవుతుందని తెలుస్తోంది.