కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవత ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా కాలమే పట్టేలా ఉంది. అందుకే ప్రజలపై భారం వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇదే బాటలో ఇంకొన్నిటిపై రేట్లు పెంచే ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. దేశంలో కరోనా వల్ల తలెత్తిన సంక్షోభంతో బాధపడుతోన్న ప్రజలపై మరింత భారం వేసేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారని ఆమె అన్నారు. ఈ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో ధరల పెంపు తప్పుడు నిర్ణయమని ఆమె విమర్శించారు. ప్రజలపై అధిక ధరల భారం మోపి లాభం పొందాలని చూడడం సరికాదని తెలిపారు.