శాస‌న‌మండ‌లిలో విచిత్ర ప‌రిస్థితులు.. ప్రొటెం చైర్మ‌న్‌గా భూపాల్‌రెడ్డి

-

తెలంగాణ శాస‌న‌మండ‌లిలో విచిత్రమైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒకేసారి చైర్మ‌న్‌, డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వీకాలం ముగియ‌డంతో కాస్త గంద‌ర‌గోళం నెల‌కొంది. వాస్త‌వానికి ఎప్పుడైనా చైర్మ‌న్ రిటైర్ అయితే డిప్యూటీ చైర్మ‌న్ బాధ్య‌త తీసుకుని చైర్మ‌న్ ఎంపిక బాధ్య‌త‌ను చూసుకుంటారు. కానీ ఈ రోజు ఒకేసారి చైర్మ‌న్‌, డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు.

శాస‌న మండలి ఛైర్మన్‌ సహా ఆరుగురి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. అలాగే డిప్యూటీ ఛైర్మన్‌ కూడా ఈరోజు రిటైర్ అయ్యారు. దీంతో ప్రొటెం ఛైర్మన్‌ గా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేరును ప్ర‌భుత్వం ఖ‌రారు చేయ‌గా.. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇప్పుడున్న మండ‌లికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వ‌ర‌కు భూపాల్ రెడ్డి చైర్మ‌న్‌గా కొన‌సాగుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగ‌ర్ ప‌నిచేశారు. వీరితోపాటు చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరి కూడా త‌మ ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ప‌ద‌వుల‌ను కోల్ప‌నున్నారు. మ‌రి ఇంకోవైపు వీరికి మ‌రోసారి ఎమ్మెల్సీగా కేసీఆర్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version