ఏపీలో న‌రాలు తెగే ఉత్కంఠ‌… జ‌గ‌న్ ఆగ్ర‌హం..!

-

ఏపీలో న‌రాలు తెగే ఉత్కంఠ కొన‌సాగుతోంది. రాజ‌ధాని బిల్లు స‌హా ఏపీసీఆర్ డీఏ బిల్లుల‌ను శాస‌న మండ‌లి తిరస్క‌రించండం, వాటిని సెల‌క్ట్ క‌మిటీకి పంపించ‌డం వంటి చ‌ర్య‌లు జ‌రిగిన స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ టీవీల‌కు అతుక్కుపోయా రు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజ‌కీయాల్లోనూ ఇటు సాధార‌ణ పౌరుల్లోనూ కూడా తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ నేప థ్యంలో దీని గురించే నిన్న మొన్న‌టి వ‌ర‌కు చ‌ర్చ సాగింది. అయితే, తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో మ‌రో కీల‌క మైన చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. రాజ‌ధాని బిల్లుల‌ను మండ‌లి ఒక అనూహ్య‌మైన వాతావ‌ర‌ణంలో సెల‌క్ట్ క‌మిటీకి పంపించ‌డంపై సీఎం జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

అదేస‌మ‌యంలో ఆయ‌న మండ‌లి ఎందుక‌నే ప్ర‌శ్న‌ను తెర‌మీదికి తెచ్చారు. ఈ క్ర‌మంలోనే ఇక మండ‌లి ర‌ద్దుపై సోమ‌వారం అసెం బ్లీలో చ‌ర్చించి ర‌ద్దుకే దాదాపు మొగ్గు చూపే ప‌రిస్థితి ఉంద‌ని తాజాగా సంకేతాలు అందాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి తెగ ఉత్కంఠ కొన‌సాగుతోంది. మండ‌లి ర‌ద్దు ప్ర‌భుత్వ చేతిలో లేద‌ని బీరాలు ప‌లికిన టీడీపీ అధినేత చంద్ర బాబు ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందోన‌నే ఆతృత‌లో మునిగిపోయారు.

ఈ క్ర‌మంలోనే పార్టీలోని సీనియ‌ర్ నేత‌ను శ‌నివార‌మే ఆయ‌న ఢిల్లీకి పంపారు. అక్క‌డ ఇప్పుడున్న ప‌రిస్థితి ఏంటి? జ‌గ‌న్ స‌ర్కారు ర‌ద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపితే.. ఏం జ‌రుగు తుంది. ఇప్పుడు టీడీపీపై బీజేపీ వ్యూహం ఏంటి? అనే చ‌ర్చ చేస్తున్నారు. మ‌రోప‌క్క‌, మండ‌లి ర‌ద్దుతో చంద్ర‌బాబు కూట‌మికి భారీ దెబ్బ త‌గులుతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. కేంద్రంలోని న‌రేంద్ర‌మో దీ ప్ర‌భుత్వం జ‌గ‌న్ స‌ర్కారుపై ఎలాంటి వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. అయితే, ఇప్పుడున్న ఏపీలో న‌మ్మ‌క‌మైన మిత్రుల్లో జ‌గ‌న్ మాత్రం ఒక‌ర‌నేది బీజేపీ పెద్ద‌లు చేస్తున్న వాద‌న కూడా..!

ఈ క్ర‌మంలో మండ‌లి ర‌ద్దును వారు వ‌చ్చే నెల్లో ప్రారంభ‌మ‌య్యే బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే పెట్టి ఆమోదించుకునే అవ‌కాశం ఉంది. అయితే, బీజేపీ నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్సీలు ఉన్నందున వారి భ‌విత‌కు జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చిన‌ట్ట‌యితే.. బీజేపీ స‌హ‌క‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. చంద్ర బాబుకు తీర‌ని దెబ్బ ఖాయ‌మ‌నే ఉత్కంఠ‌తో కూడిన చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు కానీ, ఆయ‌న పార్టీ ఫ్యూచ‌ర్ కానీ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version