తమ్ముళ్ల ఆవేదన: బాబు చేస్తోన్న రెండు అతిపెద్ద తప్పులు ఇవే!

-

40ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం, జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పిన సామర్ధ్యం, 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. గత కొన్ని నెలలుగా చేస్తున్న రాజకీయానికి, తీసుకుంటున్న నిర్ణయాలకు తమ్ముళ్లు షాక్ మీద షాక్ లకు గురవుతున్నారు! పార్టీని స్థాపించిన మహా నాయకుడు ఎన్టీఆర్ నే తప్పించి పార్టీని సొంతం చేసుకున్న శక్తి సామర్ధ్యాలు, నేర్పూ కలిగిన మా బాబుగారేనా ఇలా ఉంది అని బాదపడటానికి గల కారణాలు రెండు!!

అవును… ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు చేయాల్సింది.. వ్యూహాత్మకంగా ముందుకివెళ్తూ.. కేడర్ లో నిరూత్సాహ నీడలు కమ్ముకోకుండా, అలసత్వపు నిరాశలు అలుముకోకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ధైర్యం కలిగించాలి.. భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా ప్రవర్తించాలి. కానీ చంద్రబాబు అది అప్ప అన్నీ చేస్తున్నారు! రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం తన సొంత జిల్లాలో కూడా పరిస్థితి చేయిదాటిపోతున్నా కూడా ఈ మొద్దు నిద్ర ఏమిటో అన్నది తమ్ముళ్లకు సైతం అంతుపట్టడం లేదు!

తనను ఏకోసానా కాపడలేని, ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించి ఇవ్వలేని అమరావతి గురించి, ఏ రకంగానూ తనకు ఒక్క ఓటు కూడా పెరగడానికి సహకరించని కేసులతోనూ ఎందుకు చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటున్నారు! అవును.. ప్రస్తుతం చంద్రబాబు కేవలం అమరావతిని, కోర్టులను మాత్రమే నమ్ముకుని రూం కం జూం రాజకీయం చేస్తున్నారు! అమరావతి వచ్చినంతమాత్రాన్న బాబుకు ఆర్థికంగా బలం చేకూరవచ్చేమో కానీ ప్రజల్లో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు! దీంతో జగన్ తన తెరవెనుక రాజకీయ తాను చేసుకుంటూపోతున్నారు!

ప్రస్తుతం జగన్ చేస్తున్న రాజకీయ.. చంద్రబాబు సొంత జిల్లాకు కూడా చాపకింద నీరులా పాకింది! అక్కడ బాబుకు గ్రౌండ్ లెవెల్ లో ద్వితీయశ్రేణి నేతలు దాదాపుగా బాబుకు దూరమైపోతున్నారు! బాబు సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి గురించి బాబు ఇప్పటికైనా ఒక అవగాహనకు రావాలని తమ్ముళ్లు వాపోతున్నారు! అలాకానిపక్షంలో… జీవితం మొత్తం, రాజకీయ భవిష్యత్తు మొత్తం గతమెంతో ఘనం, వర్తమానం ప్రశ్నార్ధకం, భవిష్యత్తు అందకారంలా మారిపోతుందని తమ్ముళ్లు తెగఫీలవుతున్నారు!! మరి బాబుగారి వినిపిస్తుందా?

Read more RELATED
Recommended to you

Exit mobile version