అనుష్క పెళ్లి గురించి వింత డిస్కషన్లు…!

-

అనుష్క అసలు పెళ్లి చేసుకుంటుందా లేక లేడీ సల్మాన్‌ ఖాన్, లేడీ ప్రభాస్‌లా మిగిలిపోతుందా. స్వీటీ కంటే చిన్న హీరోయిన్లు కూడా పెళ్లిలు చేసుకొని సెటిల్‌ అవుతోంటే, ఈమెకి ఏమైంది..పెళ్లి గండం ఏమైనా ఉందా అని అనుష్కని తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

అనుష్క కంటే చిన్నోళ్లు పెళ్లి చేసుకుని అమ్మలు కూడా అవుతున్నారు. స్వీటీ కంటే అయిదేళ్లు చిన్నదైన సమంత మూడేళ్ల క్రితమే మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టింది. అనుష్క కంటే మూడేళ్లు చిన్నదైన కాజల్‌, అక్టోబర్‌ 30న మిసెస్‌గా మారుతోంది. ఇక ఈమె కంటే ఒక ఏడాది తక్కువున్న త్రిష, తమిళ స్టార్ శింబుని పెళ్లి చేసుకోబోతోందట. కానీ అనుష్క మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటోంది.

అనుష్క వయసు ఇప్పుడు 38 ఏళ్లు. మరో రేండేళ్లు అయితే ఫార్టీలో అడుగుపెడుతుంది. అయినా పెళ్లి గురించి మాత్రం మాట్లాడట్లేదు. దీంతో అనుష్క ఇంక పెళ్లి చేసుకోదేమో.. సింగిల్‌గానే లైఫ్‌ని లాగించేస్తుంది అనుకుంటా.. అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. కొంతమందైతే అనుష్కని ఎక్స్‌ట్రీమ్‌ కామెంట్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. స్వీటీకి పెళ్లి గండం ఉన్నట్లుంది.. అందుకే పెళ్లి చేసుకోట్లేదేమో అని జోకులు పేలుస్తున్నారు. మరి అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి అన్నది తెలియదు గానీ, ఫ్యాన్స్‌ మాత్రం స్వీటీ లైఫ్‌లో సెటిల్‌ అయితే చూడాలని ఆశపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version