TDP Final List: ఐదుగురు సిట్టింగ్ లకు దక్కని సీటు.. భీమిలి సీటు ఎవరికంటే?

-

ఎట్టకేలకు టీడీపీ తుది జాబితాను విడుదల చేసింది. చేయక తప్పదు కదా. ఎన్నికలు చూస్తే ఇంకా 20 రోజులే ఉన్నాయి. పార్టీలు ఇంకా అభ్యర్థుల ఖరారు దగ్గరే ఉంటే ఎన్నికల ప్రచారం ఎప్పుడు మొదలు పెట్టాలి. అందుకే.. టీడీపీ తుది జాబితాను రిలీజ్ చేసేసింది..

టెన్షన్.. టెన్షన్.. వెంకీ పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందన్నట్టుగా… ఏపీ ఎన్నికలు టీడీపీ కొంప ముంచుతున్నాయి. నెమ్మది నెమ్మదిగా ఏపీలో కూడా టీడీపీ ఖాళీ అవుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడం మాత్రం చంద్రబాబు తల ప్రాణం తోకకొచ్చింది. చంద్రబాబుకు కొందరు అభ్యర్థులు భలే షాకులిస్తుండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చివరకు అభ్యర్థులను ప్రకటించేశారు చంద్రబాబు.

tdp final list announced

ఇదివరకు రెండు విడతల్లో 140 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా… తుది జాబితాను సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసింది. గత జాబితాలో 83 మంది సిట్టింగ్ లకు అవకాశం కల్పించగా… తుది జాబితాలో మాత్రం ఐదుగురు సిట్టింగ్ లను పక్కన బెట్టారు.

విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత, శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి తుది జాబితాలోనూ చోటు దక్కలేదు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. కీలక సీటు భీమిలి నుంచి మాజీ ఎంపీ సబ్బం హరి పోటీ చేస్తున్నారు.

తుది జాబితాలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్ సభ నుంచి బరిలోకి దింపుతున్నారు. విజయనగరం నుంచి ఎంపీ అశోక్ గజపతిరాజు కూతురు అదితికి సీటు కేటాయించారు. నెల్లూరు రూరల్ అభ్యర్థిగా మొదటి జాబితాలో సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్ రెడ్డి… తర్వాత వైసీపీలో చేరగా.. ఆయన స్థానంలో అజీజ్ భాషా కు కేటాయించారు.
తుది జాబితా లిస్ట్ ఇదే..

విజయనగరం జిల్లా

1. నెల్లిమర్ల- పతివాడ నారాయణస్వామినాయుడు
2. విజయనగరం- అదితి గజపతిరాజు

విశాఖపట్నం జిల్లా
1. భీమిలి- సబ్బం హరి
2. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
3. చోడవరం- కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు
3. మాడుగల- గవిరెడ్డి రామానాయుడు
4. పెందుర్తి- బండారు సత్యనారాయణ మూర్తి



తూర్పుగోదావరి జిల్లా

అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు

పశ్చిమ గోదావరి జిల్లా

1. నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
2. నర్సాపురం- బండారు మాధవనాయుడు
3. పోలవరం- బొరగం శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా

1. తాడికొండ- తెనాలి శ్రావణ్‌కుమార్‌
2. బాపట్ల- అన్నం సతీష్‌ ప్రభాకర్‌
3. నరసరావుపేట- డాక్టర్‌ అరవింద్‌ బాబు
4. మాచర్ల- అంజిరెడ్డి

ప్రకాశం జిల్లా

1. దర్శి- కదిరి బాబురావు
2. కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

నెల్లూరు జిల్లా

1. కావలి- విష్ణువర్ధన్‌రెడ్డి
2. నెల్లూరు- రూరల్‌ అబ్దుల్‌ అజీజ్‌
3. వెంకటగిరి- కె.రామకృష్ణ
4. ఉదయగిరి- బొల్లినేని రామారావు

కడప జిల్లా

1. కడప- అమీర్‌బాబు
2. రైల్వేకోడూరు- నర్సింహ ప్రసాద్‌
3. ప్రొద్దుటూరు- లింగారెడ్డి

కర్నూలు జిల్లా

1. కర్నూలు- టీజీ భరత్‌
2. నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి
3. కోడుమూరు- బి.రామాంజనేయులు

అనంతపురం జిల్లా

1. గుంతకల్లు- ఆర్‌.జితేంద్రగౌడ్‌
2. శింగనమల- బండారు శ్రావణి
3. అనంతపురం అర్బన్‌- ప్రభాకర్‌ చౌదరి
4. కల్యాణదుర్గం- ఉమామహేశ్వరనాయుడు
5. కదిరి- కందికుంట వెంకటప్రసాద్‌

చిత్తూరు జిల్లా

1. తంబళ్లపల్లె- శంకర్‌ యాదవ్‌
2. సత్యవేడు- జేడీ రాజశేఖర్‌
3. గంగాధరనెల్లూరు- హరికృష్ణ
4. పూతలపట్టు- తెర్లాం పూర్ణం

Read more RELATED
Recommended to you

Latest news