రాష్ట్రంపై ప్రేమ తెలుగు త‌మ్ముళ్ల‌కు రాజ‌ధానికే ప‌రిమితమ‌ట‌…!

-

మీకు ఒక రాష్ట్రంపై ఇష్టం ఉంద‌ని అనుకోండి.. ఏం చేస్తారు?  ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిలో పాలు పంచుకుంటారు. లేదా ఏదో ఒక సేవా కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతారు. ఫ‌లితంగా స ద‌రు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగంగా మారిపోతారు. అయితే, మ‌న టీడీపీ నాయ‌కులు మాత్రం ఈ విష‌యంలో భిన్న‌మైన వాద‌న‌ను లేవ‌నెత్తుతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీపై త‌మ‌కు ఎన లేని ప్రేమ పెరిగింద‌ని, ఈ క్ర‌మంలోనే తాము ఏపీలో భూములు కొన్నామ‌ని ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి చెందిన నాయ‌కులు  వింత, వితండ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి రాజ‌ధానిని వ్య‌తిరేకించ‌డం లేదు. అయితే, ఇక్క‌డ రై తుల నుంచి న‌యానో.. భ‌యానో.. స‌మీక‌రించిన భూముల‌ను కొంద‌రికి క‌ట్ట‌బెట్ట‌డం, త‌ద్వారా క్విడ్ ప్రొకో.. జ‌రిగింద‌ని పార్టీ నాయ‌కులు ఆది నుంచి ఆరోపిస్తున్నారు. అది కూడా చ‌ట్టంలోని లొసుగుల‌ను అడ్డు పె ట్టుకుని నాయ‌కులు రెచ్చిపోయార‌ని, కోర్టుల‌కు కూడా దొర‌క‌ని విధంగా టీడీపీ నాయ‌కులు ఇక్క‌డ భూము లు కొన్నార‌ని వైసీపీ నేత‌లు భారీ ఎత్తున విమ‌ర్శ‌లు సంధించారు.

దీనికి సంబంధించి రెండు రోజుల కింద‌ట అసెంబ్లీలోనూ దీనిపై చ‌ర్చ సంద‌ర్భంగా మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స‌వివ‌రంగా వీటిని వెల్ల డించారు. దీంతో వెంట‌నే టీడీపీ నాయ‌కులు రంగంలోకి దిగారు. త‌మ‌కు రాష్ట్రంపై ఉన్న ప్రేమ‌తోనే రాజ‌ధానిలో భూములు కొన్నామ‌ని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర చౌద‌రి, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ వంటివారు వెల్ల‌డించారు. మొత్తానికి తాము భూములు కొన్న‌మాట‌ల‌ను వారు ఒప్పేసుకున్నారు అయితే, దీనికి మ‌ళ్లీ రాష్ట్ర ప్రేమ‌ను జ‌త‌క‌ల‌ప‌డం చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిజానికి రాష్ట్రంపై ప్రేమ ఉన్న‌వారు వెనుక బ‌డిన ప్రాంతాలైన సీమ‌, ఉత్త‌రాంద్ర‌ల్లో కారు చౌక‌కు భూములు కొనుగోలు చేసి..అక్క‌డ ఇండ‌స్ట్రీలు పెట్టుకుంటే.. ఎంతో మందికి ఉపాధి ల‌భించేది క‌దా..? అనే ప్ర‌శ్న‌కు వారి వ‌ద్ద స‌మాధానం లేదు. మొత్తానికి తాము చేసిన త‌ప్పును ఎంచ‌క్కా  చ‌క్క‌దిద్దుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగా నాయకులు చేస్తున్న మాట‌ల గార‌డీని ప్ర‌జ‌లే ఛీత్క‌రించే ప‌రిస్థితి వ‌స్తుంద‌నే విష‌యాన్ని గ‌మ‌నిస్తే బెట‌ర్ అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version