అధినేత గురించి తెలుగుదేశం పార్టీ లో కీలక చర్చ !

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వాలను ఆదుకోవటానికి చాలా మంది ప్రముఖులు రాజకీయ నాయకులు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వానికి మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధి కి విరాళాలు అందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీ ప్రభుత్వానికి ప్రకటించిన… తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఇవ్వలేదు.రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక నేతగా పేరొందిన చంద్రబాబు చాలా సందర్భాలలో రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి అని పేర్కొనటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉన్న చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి విరాళం ప్రకటించకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీలో కీలక చర్చ జరుగుతోంది.

 

పార్టీపరంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టీడీపీ ని చంద్రబాబు పూర్తిగా వదిలేసినట్లు లేనా అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఇదే టైం లో నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో హడావిడి చేసిన లోకేష్ కూడా ప్రస్తుతం ఏమీ మాట్లాడకపోవడం బట్టి చూస్తే తెలంగాణలో పార్టీ క్లోజ్ అయినట్లేనా అని టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క చంద్రబాబు అంటే గిట్టని వాళ్ళు కేవలం రాజకీయాలు ఉంటేనే ఆయన విరాళాలు ఫోటోలకి ఫోజులు ఇవ్వటం జరుగుతుంది అంటూ కేవలం ఏపీకి చంద్రబాబు విరాళం ప్రకటించడం పట్ల సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version