2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి టిడిపి 23 శాసనసభ స్థానాలు దక్కించుకుంది. వచ్చిన ఈ ఫలితాలకు ముక్కుతూ మూలుగుతూ చంద్రబాబు నాయుడు పార్టీని నడిపించుకుంటూ పోతున్నా విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వంశీ మరియు మద్దాల గిరి ఇద్దరూ పార్టీని వీడటం జరిగింది.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 21 పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపి ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలు ఏంటి అని అనుకుంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏలూరి సాంబశివరావు అనే టీడీపీ ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నారట. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏలూరి సాంబశివరావు కామెంట్లు చేశారు.
2014 మరియు 2019 ఎన్నికల్లో గెలిచిన సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా వెనుకాడకుండా సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఎక్కడా కూడా సమస్య లేకుండా రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ పరిష్కారం చూపే దిశగా ఈ టీడీపీ యువ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే యువ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయమని డిసైడ్ అయిపోయారు. మరోపక్క ఏలూరి అనుచరులు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు సమస్యలు లేకుండా ప్రతిదీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకు వస్తున్నారు.