ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉద్యమం నేడు 35 వర రోజుకి చేరుకుంది. మూడు రాజదానులకు రాష్ట్ర శాసన సభ ఆమోద ముద్ర వేసిన నేపధ్యంలో ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. విశాఖ పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలుని రాజధానిగా చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనితో ఇప్పుడు ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది.
నేడు మండలి ముందుకి ఈ బిల్లు రానుంది. మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండటంతో ఈ బిల్లుని ఏ విధంగా ఆమోదించాలి అనే దానిపై అధికార పార్టీ కసరత్తులు సిద్దం చేసింది. ఇదిలా ఉంటే సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి పోలీసులు తెలుగుదేశ౦ ఎంపీ గల్లా జయదేవ్ ని అరెస్ట్ చేసారు. ఆయన పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు.
దీనితో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు. ఆయనను అర్ధ రాత్రి మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఆయన బెయిల్కి దరఖాస్తు చేసినా సరే బెయిల్ ఇవ్వలేదు. ఆయనతో పాటు మరికొందరు నేతలను గుంటూరు సబ్ జైలుకి పోలీసులు తరలించారు. దీనితో ఆయన్ను విడుదల చెయ్యాలని తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.