ఆ పార్టీపై మమకారం చావలేదు.. కాంగ్రెస్ కు ఓటేయండి.. టీడీపీకి ఝలక్ ఇచ్చిన జేసీ

-

అనంతపురం జిల్లా నారాయణపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పుట్టి పెరిగిన నాకు ఆ పార్టీపై ఇంకా మమకారం చావలేదు.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఎన్నికల వేళ ఇప్పటికే టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తాకాయి. ఎన్నికలు ఇంకా రెండు రోజులు ఉన్నాయనగా టీడీపీకి మరో ఎదురు దెబ్బ తాకింది. టీడీపీ ఎంపీయే టీడీపీకి భలే షాకిచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో అందరూ షాకయ్యారు.

అనంతపురం జిల్లా నారాయణపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పుట్టి పెరిగిన నాకు ఆ పార్టీపై ఇంకా మమకారం చావలేదు. అందుకే నేను ఇలా నా మనసులోని మాటను చెప్పాను. మీరంతా టీడీపీకి కాకుండా కాంగ్రెస్ కు ఓటేయండి. నాకు హిందీ రాదు. అందుకే ఎంపీగా ఫెయిల్ అయ్యా. నా కుటుంబం గద్వాల్ నుంచి వలస వచ్చిన మాట వాస్తవమే. నా స్థానికతను మీరు ప్రశ్నించొద్దు.. అంటూ జేసీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version