రేవంత్ రైజింగ్: టీడీపీ వదిలేలా లేదుగా!

-

రేవంత్ రెడ్డిని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ గాని, ఆ పార్టీ కార్యకర్తలు గాని ఎంత కష్టపడుతున్నారో తెలియదు గాని.. టీడీపీ గాని, ఆ పార్టీ కార్యకర్తలు గాని ఇప్పటికీ కష్టపడుతున్నారనే చెప్పొచ్చు.. అసలు రేవంత్, టీడీపీని వదిలేసి ఐదేళ్లు పైనే అయిపోయింది.. అయినా సరే టీడీపీ, రేవంత్ రెడ్డిని వదలడం లేదా? అంటే లేదనే చెప్పాలి.. ఇప్పటికీ పరోక్షంగా టీడీపీ సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఉందనే విషయం బహిరంగ రహస్యమే.. ఇందులో ఎలాంటి అనుమానం లేదు..రేవంత్ కూడా పరోక్షంగా టీడీపీ పట్ల అభిమానంగా ఉంటారనే విషయం కూడా తెలిసిందే.

అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగైన విషయం తెలిసిందే.. అయినా సరే అక్కడ టీడీపీని అభిమానించేవారు.. రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా నిలుస్తున్నారు..ఇందులో కూడా ఎలాంటి అనుమానం లేదనే చెప్పాలి.. అంటే ఏదొక విధంగా టీడీపీ సపోర్ట్ అనేది రేవంత్ రెడ్డికి ఉందని చెప్పాలి.. అసలు రేవంత్ రెడ్డిని బలమైన నాయకుడుగా నిలబెట్టడానికి పరోక్షంగా కృషి చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఏదొకరకంగా టీడీపీ హెల్ప్ రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించే మీడియా సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డికి ఉంది..ప్రస్తుతం రాజకీయాల్లో ప్రతి పార్టీకి సొంత మీడియా సపోర్ట్ ఉంది..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి సొంత మీడియా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా లేదు..అలాగే మీడియా సపోర్ట్ కూడా తక్కువ.

మీడియా సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది..ఆ విషయం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.. అందుకే తాను పి‌సి‌సి అయిన వెంటనే ముగ్గురు బడా మీడియా సంస్థల యజమానులతో భేటీ అయ్యి, వారి సపోర్ట్ తీసుకున్నారు…ఆ మూడు మీడియా సంస్థలు ఏవో అందరికీ తెలిసిందే..అవి పూర్తిగా టీడీపీ అనుకూల మీడియా సంస్థలు అని కూడా అందరికీ తెలుసు. ఆ మీడియా సంస్థలు తెలంగాణలో రేవంత్ రెడ్డిని బాగా లేపుతున్నాయి…ఇక ఇటీవల రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీని కూడా ఆ మూడు మీడియా సంస్థల యజమానులతో సమావేశమయ్యేలా చేశారట. అంటే ఇకపై మరింత ఎక్కువగా రేవంత్ రెడ్డిని లేపేందుకు ఆ టీడీపీ అనుకూల మీడియా సంస్థలు పనిచేయనున్నాయని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీతోనే రేవంత్ రైజింగ్ అనమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version