రచ్చ రాజకీయం: పనికిమాలిన డిమాండ్లు…!

-

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు హద్దులు దాటేసి నాయకులు బూతులతో రెచ్చిపోతున్నారు. వాళ్ళు, వీళ్ళు అనే తేడా లేకుండా తిట్టుకుంటున్నారు. జగన్‌ని టీడీపీ నేతలు బూతులు తిడితే…చంద్రబాబుని వైసీపీ నేతలు పచ్చి బూతులు తిడుతున్నారు. ఇక టి‌డి‌పి బూతులు తిట్టిందని ప్రతిగా…వైసీపీ శ్రేణులు, టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తే చంద్రబాబు, బంద్‌కు పిలుపునిచ్చి ప్రజలని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ బంద్ సక్సెస్ కాలేదు.

ysrcpandtdp

అలాగే దాడులకు నిరసనగా దీక్ష కూడా చేస్తున్నారు…అటు వైసీపీ కూడా కౌంటర్ దీక్షలు చేస్తుంది. అయితే రెండు పార్టీలు కలిసి పనికిమాలిన రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయమే కాదు…పనికిమాలిన డిమాండ్లు కూడా చేసుకుంటున్నాయి. అసలు టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేస్తే, రాష్ర్టంలో శాంతిభద్రతలు లేవని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారో కూడా ఇన్ని ఏళ్ళు రాజకీయం చేసిన చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. ఏదో కాశ్మీర్ లాంటి చోటే రాష్ట్రపతి పాలన పెట్టడానికి కేంద్రం వెయ్యి ఆలోచనలు చేసుద్ది…అలాంటిది ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని బాబు మాట్లాడటం బాగా కామెడీగా ఉంది.

ఇక ఒక టి‌డి‌పి నేత జగన్‌ని తిట్టారని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ టి‌డి‌పినే బ్యాన్ చేయాలని అంటున్నారు. అంటే వైసీపీ నేతలు చంద్రబాబుని తిట్టిన బూతులకు వైసీపీని ఏం చేయాలో బొత్సనే చెప్పాలి. మావోయిస్టు పార్టీకి, టీడీపీకి తేడా లేదని, టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని బొత్స కూడా పనికిమాలిన డిమాండ్ చేశారనే చెప్పొచ్చు. అసలు నేతల మాట్లాడే మాటలకు పార్టీని నిషేదించాలని కోరడం….అటు ఆఫీసులపై దాడి జరిగితే ఏదో ఉగ్రవాదం ఉన్నట్లు రాష్ర్టపతి పాలన కోరడం అనేవి పనికిమాలిన డిమాండ్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version