“ఈటల వెన్నుపోటు”పై సినిమా… క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారు ఉండరు. రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వెండితెరపై సినిమా తీసినా… ఓటిటీలో వెబ్ సిరీస్ రూపొందించిన ఆయన స్టైలే వేరు. ఇంకా బయోపిక్ సినిమాల నిర్మాణం లో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రక్త చరిత్ర, కడప రెడ్లు, చంద్రబాబు వెన్నుపోటు పై సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై సినిమా రూపొందిస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే… గత రెండు రోజుల నుంచి రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్… సీఎం కేసీఆర్ ఎపిసోడ్ నేపథ్యంలో ఓ సినిమాను రాంగోపాల్ వర్మ తీస్తున్నారని… ఆయన పేరుతో పేరుతో ఓ పోస్టు వైరల్ అయింది. అంతేకాదు ” వెన్నుపోటు ఈటెలు” అంటూ టైటిల్ కూడా రాంగోపాల్ వర్మ ఫిక్సైనట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై స్వయంగా రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. తన పేరుతో కొందరు అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ పోస్టర్ ను వదిలారని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. తాను ఈటెల ఎపిసోడ్ పై ఇలాంటి సినిమాలు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version