షర్మిలపై టీడీపీ సానుభూతి..యెల్లో మార్క్ పాలిటిక్స్.!

-

గత నాలుగేళ్లుగా ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి టి‌డి‌పి విమర్శలు చేస్తుందో చెప్పాల్సిన పని లేదు.మంచి కార్యక్రమాలు చేసిన సరే టార్గెట్ చేసి విమర్శించేవారు. ఇదే సమయంలో వివేకా హత్య కేసుపై నాలుగేళ్ల నుంచి టి‌డి‌పి రాజకీయం చేస్తూనే ఉంది..బాబాయిని అబ్బాయే చంపాడు అంటూ అసత్య కథనాలు సృష్టిస్తూ రాజకీయం పబ్బం గడుపుతుంది. తాజాగా వివేకా కేసులో సి‌బి‌ఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలంపై టి‌డి‌పి నేతలు స్పందిస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలని,  షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ అనుకున్నారని.. షర్మిల ఎంపీ సీటు కోసం వివేకా పట్టుబట్టారని చెప్పారు. వివేకా అడ్డుగా ఉన్నారని హత్య చేశారని టి‌డి‌పి నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.  లోటస్ పాండ్‌లోనే వివేకా మర్డర్ స్కెచ్ వేశారని, వివేకా హత్య విషయం తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

పులివెందులకు వెళ్లాక జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా.. ఇంటికి ఎందుకెళ్లారని, హత్య విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లడం ఏంటి అంటూ మండిపడ్డారు. వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి అంటూ వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహని ఉందని, కేంద్రం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి దీనిపై లేఖ రాయనున్నట్లు తెలిపారు.

వైఎస్ వివేకా హత్య వల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో.. టీడీపీ అంతే నష్టపోయిందని, వివేకా హత్య తర్వాత టీడీపీ ఆరోపణలు చేసి సానుభూతితో ఓట్లేయించుకుని జగన్ గెలిచారని ఆరోపించారు. వివేకా హత్య విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అటు వైఎస్ సునీత, ఇటు షర్మిల పట్ల సానుభూతి చూపుతూ..జగన్‌ని విలన్‌గా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలనేది టి‌డి‌పి ప్లాన్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version