వివేకా హత్య కేసులో సజ్జలనే సీఎం జగన్ పేరు చెప్పమన్నారు – వైఎస్ సునీత

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ కేసులోని మరికొన్ని సంచలన విషయాలను నేడు సిబిఐ కి వెల్లడించారు వివేకా కుమార్తె సునీత. తన తండ్రి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, సీఎం జగన్ పేరుని ప్రస్తావించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనకు చెప్పారని తెలిపారు సునీత.

” 2019 మార్చి 22న వైఎస్ భారతి నాకు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చి నన్ను కలుస్తానని అన్నారు. నేను సైబరాబాద్, కడప కమిషనరేట్ కి వెళ్లాల్సి ఉందని చెప్పారు. ఎక్కువ సమయం కాకుండా తొందరగా కలిసి వెళ్తానని చెప్పి వైఎస్ భారతి ఇంటికి వచ్చారు. ఆమె వెంట విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో ఆశ్చర్యపోయాను. లిఫ్ట్ వద్దనే వారితో మాట్లాడాను. ఆ సమయంలో భారతీ కాస్త ఆందోళనగా కనిపించారు.

ఇకనుంచి ఏం చేసినా సజ్జల తో టచ్ లో ఉండాలని భారతీ నాకు చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాలని ప్రజల రామకృష్ణారెడ్డి నాతో అన్నారు. ఆయన ఆలోచన నాకు కాస్త ఇబ్బందిగా అనిపించినా వీడియో చేసి పంపించా. ఆ తరువాత ఈ వీడియో కాకుండా ఈ అంశానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు.

ఆ ప్రెస్ మీట్ లో జగనన్నతో పాటు అవినాష్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారు. అందుకే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాను. అవినాష్ అభ్యర్థిత్వాన్ని మా నాన్న కోరుకోలేదు. మా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయి. నాన్న చనిపోయాక ఇచ్చిన ఫిర్యాదు పై నేను సంతకం చేయలేదు” అని సంచలన విషయాలు బయట పెట్టారు సునీత.

Read more RELATED
Recommended to you

Exit mobile version