హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నికలు: మరో ఘోర అవమానానికి సిద్ధమవుతున్న చంద్రబాబు..?

-

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రస్తుతం కాలం కలసిరావడం లేదు. ఓ ఏడాది కాలంగా ఆయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. గతేడాది ఇదే సమయంలో ఆయన తెలంగాణ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించారు. కాంగ్రెస్ తో జట్టుకట్టి.. తెలంగాణలో మహా కూటమి ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను ఢీకొనేందుకు చాలా ప్రయత్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా క్రియాశీలపాత్ర పోషించారు.

కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాజయం ఎదురైంది. తెలంగాణలో కేవలం రెండంటే రెండే అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. చంద్రబాబు స్థాయి నేతలు ఇది నిజంగా ఘోరమైన అవమానమే. కూకట్ పల్లిలో ఏకంగా ఆయన కుటుంబ సభ్యురాలు కూడా ఓడిపోయారు. ఇక ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అంత కంటే పెద్ద దెబ్బే తగిలింది.

 

టీడీపీ కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ఘోర అవమానం ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణలోని హుజూర్ నగర్‌లో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందట. తద్వారా తెలుగుదేశం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చినట్టే.

వాస్తవానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమను బలపరచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కోరారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెసు తరఫున పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పోటీ చేయాలని నిర్ణయించడం షాకింగ్ నిర్ణయంగా చెప్పాలి.

మొన్నటి తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో అసలు తెలుగు దేశం పార్టీ పోటీయే చేయలేదు. అలాంటిది హుజూర్‌ నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించేదే.. ఓటమి ఎలాగూ తప్పదని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఇంత సాహసం చేస్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయమే. అద్భుతాలు జరిగితే తప్ప ఇక్కడ తెలుగు దేశం పార్టీ గెలిచే అవకాశాలు లేవు. ఉన్న పరువు పోవడం తప్ప ఈ ఉపఎన్నికలో పాల్గొనడం ద్వారా సాధించేదేమీ ఉండదని కొందరు టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version