కొన్నేళ్ల పాటు ఉన్న అలవాటు ఒక్కసారిగా మారాలంటే ఎవరికైనా కష్టమే. దీనికి ప్రజాప్రతినిధులు అతీతులేం కాదు. ఇలాంటి సంఘటనే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎదురైంది. ఇన్నేళ్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో మంత్రి బీఆర్ఎస్ పార్టీ పేరును పలకబోయి.. తప్పులో కాలేశారు.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రోజున దసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ కొత్త పేరునే మర్చిపోయారు. బీఆర్ఎస్ కు బదులుగా బీఎస్పీ అనేశారు. వరంగల్ లోని ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ సంఘటన జరిగింది.
ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఓ సందర్భంలో కొత్తగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ అని మర్చిపోయారు. అది ఏంటని జనాల్ని అడిగారు. అక్కడున్న వారు బీఎస్పీ అనడంతో.. అదే ఫ్లోలో మంత్రి కూడా బీఎస్పీ అని అనేశారు.