తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల అయింది. జనవరి 22న పోలింగ్ జరుగుతుంది. ఓటరు జాబితా కూడా ఇప్పటికే విడుదలైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తో పాటు టీడీపీ, వామపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లు సమర్పించడం ఇప్పటికే ముగిసింది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో కీలకంగా ఉన్న టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఆవిధంగా లేదు.
అందుకు నిదర్శనం, ఆ పార్టీ తరఫున దాఖలైన నామినేషన్ల సంఖ్యే, తెలంగాణలో టీడీపీ తరఫున నామినేషన్లు వేసిన వారి సంఖ్య ఆశ్చర్యం కలుగుతోంది. చాలా చోట్ల దాఖలైన నామినేషన్ల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా, కొన్ని చోట్ల మాత్రం డబుల్ డిజిట్ లో ఉన్నాయి.