రాష్ట్రంలో అతి త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. పదవీ కాలం ముగిసిన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించిన విషయం తెలిసింది. అయితే తాజాగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లో 3149 వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసింది. అలాగే ఎంఏ అండ్ యూడీ డిపార్టుమెంట్ విడివిడిగా 131 ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఇక త్వరలోనే వార్డులవారిగా ఎలక్టోరల్ రోల్స్, బీసీ ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయనుంది.అయితే జనవరి 2020 తొలి వారంలోనే ఎన్నికల నగారా మోగనుంది. మరియు ఫిబ్రవరి 2020లో మున్సిపల్ కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్నారు. కాగా, 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది.