ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను జమ్ముకశ్మీర్ గవర్నర్ గా నియమించాలని యోచిస్తోందట. అంటే అక్కడి గవర్నర్ ఇక్కడికి.. ఇక్కడి గవర్నర్ అక్కడికి అన్నమాట.
తెలంగాణ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నరసింహన్ మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్రం.
తాజాగా… ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను కూడా మార్చాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం జమ్ము కశ్మీర్ గవర్నర్ గా సేవలందిస్తున్న సత్యపాల్ మాలిక్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించాలని కేంద్రం ఆలోచిస్తోందట.
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను జమ్ముకశ్మీర్ గవర్నర్ గా నియమించాలని యోచిస్తోందట. అంటే అక్కడి గవర్నర్ ఇక్కడికి.. ఇక్కడి గవర్నర్ అక్కడికి అన్నమాట.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. జమ్ము కశ్మీర్ లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తోంది. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ దే కీలక పాత్ర ఉంటుంది.
నరసింహన్ కు రా, కేంద్ర ఇంటెలిజెన్స్ లాంటి కీలక విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో నెలకొన్న సున్నిత పరిస్థితులను అదుపులో ఉంచాలంటే నరసింహన్ సరైన వ్యక్తని కేంద్రం భావిస్తోంది. అందుకే… నరసింహన్ ను జమ్ముకశ్మీర్ గవర్నర్ గా, జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక.. జమ్ము కశ్మీర్ గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్… ఏడాది కింద గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.