ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కదా. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటూ గుత్తాకు సీఎం కేసీఆర్ నుంచి ఆహ్వానం అందింది.
గుత్తా సుఖేందర్ రెడ్డి… 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నల్గొండ ఎంపీగా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి పార్టీలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించారు.
అయితే… మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గుత్తాకు సీఎం కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అందుకే… టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కదా. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటూ గుత్తాకు సీఎం కేసీఆర్ నుంచి ఆహ్వానం అందింది.
దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఇవాళ ప్రగతి నగర్ కు వెళ్లి తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజతలు తెలిపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి.. నామినేషన్ దాఖలు చేయడం కోసం ఆయనకు సహకరించాలంటూ సీఎం కేసీఆర్… ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని ఆదేశించారు.