ఆ బాలికను అందుకే కాల్చేసాం, సుప్రీం కోర్ట్ కి చెప్పిన సర్కార్

-

హత్రాస్ సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. శాంతిభద్రతల సమస్యలను అదుపు చేయడానికి 19 ఏళ్ల యువతీ మృతదేహాన్ని రాత్రి పూట దహనం చేశారని చెప్పింది. సెప్టెంబరులో జరిగిన నేరాల తరువాత రాజకీయ పార్టీలు మరియు పౌర సమాజ సంస్థలు కుల విభజన కోసం ప్రయత్నం చేశాయని ప్రభుత్వం పేర్కొంది.

“ఉదయం పెద్ద ఎత్తున హింసను నివారించడానికి బాధితురాలి తల్లిదండ్రులను రాత్రిపూట అన్ని మతపరమైన ఆచారాలతో దహనం చేయమని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. మరణించిన బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్ అప్పటికే ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్ ఆసుపత్రిలో నిర్వహించామని చెప్పింది. సెప్టెంబర్ 14 న మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది, రెండు వారాల తరువాత ఆమె న్యూఢిల్లీలోని ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version