ఇక ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ప్రాధాన్య సంతరించుకున్న వేళ.. భేటీపై కొండా క్లారిటీ ఇచ్చారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల తనకు పాత స్నేహితుడని ఆ కోణంలోనే కలిశానని చెప్పారు. ఈటల భార్య జమున తమకు బంధువని సానుభూతి తెలిపేందుకు కళిశానన్నారు.
ఈటలను కేసీఆర్ బర్తరఫ్ చేయగానే షాక్ అయ్యానని, ఇప్పుడు కూడా అదే విషయం మాట్లాడిన్టు చెప్పారు. అంతేగానీ ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని, తాను ఒక స్నేహితుడిగా మాత్రమే ఈటలను కలిసినట్టు చెప్పారు. ఇక తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే క్లారిటీ ఇస్తానని వివరించారు.