బ్రేకింగ్ః ఈట‌ల‌తో కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి భేటీ..

-

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. మాజా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి భేటీ అయ్యారు. శామీర్‌పేట‌లోని ఈట‌ల నివాసంలో ఆయ‌న‌ను కొండా క‌లిశారు. సాయంత్రం మొద‌లైన వీరి స‌మావేశం ఇంకా కొన‌సాగుతోంది. అయితే కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న కొండా ఈట‌ల‌తో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2018లో చేవెళ్ల ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన కొండా.. అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌కు దూరంగానే ఉంటున్నారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొన‌ట్లేదు.ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న భవిష్యత్ కార్యాచ‌రణ ప్రకటించలేదు. సొంతంగా పార్టీపెడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగా ఇప్పుడు ఈట‌ల‌ను క‌ల‌వ‌డం వెన‌క ఇదే అంశం ఉంద‌ని చ‌ర్చ‌సాగుతోంది. మ‌రికాసేప‌ట్లో దీనిపై స్ప‌ష్ట‌త రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version