ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలి – ఎంపీ కోమిటి రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రం లో ఆర్టీసీ టికెట్ల ధ‌ర ల‌ను పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పై భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి స్పందించాడు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం సరి అయినది కాద‌ని అన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి కే కేంద్ర ప్ర‌భుత్వం వ‌ల్ల పెట్రోల్, డిజిల్ ధ‌రలు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని అన్నారు.

ఇలాంటి సంద‌ర్భాల లో ప్ర‌జ‌లు ఆర్టీసీ బ‌స్సుల ను వాడుతున్నార‌ని తెలిపారు. ఇప్పుడు ఆర్టీసీ బ‌స్సుల ఛార్జీల ను కూడా పెంచితే మూలిగే న‌క్క మీద పండు ప‌డిన‌ట్టు ఉంటుంద‌ని అన్నారు. పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జల ను ఆదుకునే విధం గా ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉండాల‌ని అన్నారు. కానీ ఆ పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను దోచు కునే విధం గా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్టీసీ టికెట్ల ధ‌ర పెంపు నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news