హెలికాప్టర్ లేనిదే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదని తెలుస్తోంది. 3 కిలోమీటర్ల దూరం, మండలాల పర్యటనలకు సైతం మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు సీఎం రేవంత్ హూజుర్ నగర్ పర్యటన నేపథ్యంలో గత వారం రోజుల్లో 3 సార్లు హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి హుజూర్ నగర్‌కు మంత్రి ఉత్తమ్ వెళ్లినట్లు తెలిసింది.
శనివారం పర్యటనలో భాగంగా రామస్వామి గుట్ట నుండి సీఎం మీటింగ్ జరిగే ప్రాంతానికి మధ్య దూరం సుమారు 3 కిలోమీటర్లు అయితే.. దానికి కూడా హెలికాప్టర్లోనే మంత్రి వెళ్లినట్లు సమాచారం.హుజూర్ నగర్ నియోజక వర్గంలోని మెళ్లచెరువు, నేరేడుచెర్ల మండలాల మధ్య సుమారు 15 నుండి 30 కిలోమీటర్ల దూరం ఉండగా మండలాల పర్యటనలకు సైతం హెలికాప్టర్లోనే మంత్రి ఉత్తమ్ చక్కర్లు కొడుతున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనం హెలికాప్టర్ పర్యటనలకే
3 కిలోమీటర్ల దూరం, మండలాల పర్యటనలకు సైతం హెలికాప్టర్ వాడుతున్న మంత్రి ఉత్తమ్
రేపు సీఎం రేవంత్ రెడ్డి హూజుర్ పర్యటన కోసం గత వారంరోజుల్లో 3 సార్లు హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి హుజూర్ నగర్ వెళ్ళిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈరోజు శనివారం పర్యటన… https://t.co/iyYV2KRiDa pic.twitter.com/DJlI8d1RCC
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2025