తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటితో 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగుతమ్ముళ్లు నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారాలోకేశ్ సైతం హాజరయ్యారు.
వారి వెంట టీడీపీ నేతలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు అనంతరం నారాలోకేష్, టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్‌కు నివాళ్లు అర్పించారు.