వారంద‌రినీ ఒకే వేదిక మీద‌కు తెస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి.. మాస్ట‌ర్ ప్లాన్‌..

-

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు వేగం పుంజుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎప్పుడైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక వ‌చ్చిందో అప్ప‌టి నుంచే అన్ని పార్టీల్లోనూ స్ప‌ష్ట‌మైన మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇక నోటిఫికేష‌న్ రిలీజ్ కాకముందే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి టీఆర్ ఎస్‌, బీజేపీ. ఇక అంద‌రూ ఊహించ‌న‌ట్టే టీఆర్ ఎస్ త‌ర‌ఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బ‌రిలో దించుతున్నారు కేసీఆర్‌. ఇక నియోజ‌క వ‌ర్గంలో అధికంగా ఓట్లున్న ద‌ళిత‌లు కోసం మ‌రో ప్లాన్ వేస్తున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్

ఇక వీరి కోసం ఇప్ప‌టికే దళిత బంధు స్కీమ్ ను ప్ర‌వేశ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా స్కీమ్ లాంచింగ్ ను ఈ నెల 16న నిర్వ‌హిస్తున్న కేసీఆర్ ఈ సంద‌ర్భంగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజ‌కీయ ప్రజా ప్రతినిధులందర‌నీ ఒకే వేదిక మీద‌కు తెచ‌చేందుకు రెడీ అయ్యారు. ఎందుకంటే అప్పుడే ఆ వ‌ర్గం వారు కేసీఆర్‌ను న‌మ్ముతార‌నే ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఇందుకోసం ఇప్పటికే ఆయా రాజ‌కీయ పార్టీల్లోని దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ఇత‌ర ముఖ్య స్థాయిల్లో ఉంటున్న వారంద‌రినీ స్కీమ్ లాంచింగ్ కు రావాలంటూ ఆహ్వానాలు కూడా పంపారని తెలుస్తోంది. దీన్ని పైల‌ట్ ప్రాజెక్టు గా ప్ర‌జెంట్ చేస్తూ దీన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెల్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ స్కీమ్‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా ద‌ళిత జాతికి అభ్యున్న‌తి కోసం చూడాలంటూ కోర‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ విధంగా కేసీఆర్ వేస్తున్న ప్లాన్ స‌క్సెస్ అయితే దాని ఇంపాక్ట్ బాగానే ఉంటుంద‌ని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version