గ్రేట‌ర్ ప్ర‌చారానికి తెర‌

-

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం ఇవ్వాల‌టితో ముగియ‌నుంది. సాయంత్రం 6గంట‌ల‌కు మైక్ మూగ‌బోనున్నాయి. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండింటిని విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. టెలివిజన్‌-సినిమాటోగ్రఫీ ద్వారా ప్రసారాలు చేయొద్ద‌ని, వెంట‌నే మద్యం అమ్మకాలపై నిషేధం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొన్న‌ది. ప్రచార గడువు ముగిశాక.. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివాసం లేని, ఓటర్లు కాని వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రచాకర్తలందరూ గ్రేట‌ర్ దాటి వెళ్లాల‌ని ఆదేశాలు జారీ చేరి చేసింది.

డిసెంబరు 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 4న లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, పోలింగ్‌ రోజున అభ్యర్థికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు. అనుమతి పత్రాన్ని వాహనానికి అతికించాలని ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. అభ్యర్థి, అతని ఏజెంట్‌ ఈ వాహనంలో తిరగవచ్చని, ఇతరులకు ఇందులో అనుమతి లేదని తేల్చి చెప్పింది. పోలింగ్‌ ఏజెంట్లు, రిలీఫ్‌ ఏజెంట్లుగా సంబంధిత డివిజన్‌ పరిధిలోని వారినే నియమించాలని అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version