ఆ వర్గం మనసుల్ని గెలుచుకునేలా జగన్ ఏదైనా చెయ్యాల్సిందేనా ?

-

ముందుచూపు లేకుండా లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో జగన్ ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నోటికి ఇష్టం వచ్చినట్లు ప్రతి హామీ ఇచ్చేసి ఇప్పుడు మా పొట్ట కొడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. అసలే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని జీతాలకు సంబంధించి రెండు టర్మ్స్ లో ఇస్తామని జగన్ ఇచ్చిన ప్రకటనపై తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు.పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇటీవల వైఎస్ జగన్ సర్కార్ సున్నా వడ్డీకే డబ్బులు ఇవ్వడానికి 1400 కోట్ల రూపాయలను కేటాయించడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ ఖజానాలో డబ్బులు లేవని ఈ విధంగా ఇచ్చిన హామీలకు డబ్బులు ఖర్చు పెడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయటం ప్రభుత్వానికి మంచిది కాదంటూ ప్రభుత్వ ఉద్యోగులు సీరియస్ అవుతున్నారు. తమకు రావలసిన జీతాల విషయంలో ఫుల్ గా ఒకేసారి జమ చేయాలని కోరుతున్నారు.

 

ప్రభుత్వ పనులు చేసే ఉద్యోగులు కూడా మనుషులే అని మాకు కూడా కష్టాలు ఉంటాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో పార్టీ పెద్దలు జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో టాక్. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగుల నుండి వస్తున్నా ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టడానికి లాక్ డౌన్ అయిన వెంటనే.. వాళ్లలో ఉన్న అసంతృప్తిని తొలగించే విధంగా జగన్ సరికొత్త ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version